*ఈ ఏడాది అక్టోబర్‌లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఆధార్ కార్డును ఏటీఎం కార్డు సైజులో ఉన్నంత పాలి వినైల్ కార్డు రూపంలో భారత పౌరులకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మన పాకెట్లో ఇమిడి పోయే పాన్ కార్డు, డెబిట్, క్రెడిట్ కార్డు సైజులో ఉండటం ఈ ఆధార్ కార్డు ప్రత్యేకత. యూఐడీఏఐ.. పీవీసీ కార్డును పొందేందుకు మరిన్ని వెసులుబాట్లను కల్పించింది. ఈ కార్డును పొందటానికి రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌తో పని లేదని, ఓటీపీ కోసం ఏ మొబైల్ నెంబర్‌నైనా వాడవచ్చని తాజా ప్రకటనలో పేర్కొంది. ఓ వ్యక్తి తన కుటుంబం మొత్తానికి పీవీసీ ఆధార్ కార్డులను ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేయవచ్చని తెలిపింది. ఈ కార్డు పొందటానికి మనం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.*
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT